Header Banner

టెస్లా ప్రాజెక్ట్‌ ఏపీకి బంపర్ ఆఫర్! కానీ చివరికి ఏమవుతుంది అంటే..

  Sat Feb 22, 2025 16:41        Business

జాతీయ,అంతర్జాతీయ పరిశ్రమలను ఆకర్షించేందుకు తీవ్రంగా కృషిచేస్తున్న ఏపీ ప్రభుత్వం.. మరో కీలకమైన ప్రాజెక్టుపైనా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా.. భారతదేశంలో ప్లాంట్ ఏర్పాటు కోసం ఎప్పటి నుంచి మరో ప్రయత్నాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, ఎలాన్ మస్క్ భేటీ కావటంతో ఈ ప్లాంట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే టెస్లా ప్లాంట్ కోసం ఏపీ కూడా రేసులోకి వచ్చిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనలో భాగంగా ఎలాన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇక అప్పటి నుంచి భారతదేశంలో టెస్లా కార్ల ప్లాంట్ గురించి చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఈ రేసులోకి ఇప్పుడు ఏపీ వచ్చి చేరింది. టెస్లా ప్లాంట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ అయిన టెస్లా మనదేశంలోకి వచ్చేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. అయితే వివిధ కారణాలతో ఆ అడుగులు ముందుకు పడలేదు. అయితే టెస్లా ప్లాంట్ కోసం అనేక రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు టెస్లా ప్లాంట్‌ను తమ రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. తాజాగా ఈ రేసులోకి ఆంధ్రప్రదేశ్ కూడా చేరినట్లు తెలిసింది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు! 

 

టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా కృషిచేస్తున్నట్లు ఎకనమిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అభివృద్ధి బోర్డు (EDB) ఆంధ్రప్రదేశ్‌ను టెస్లాకు అనువైన గమ్యస్థానంగా మార్చుతున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోర్టుల అనుసంధానం, భూమి లభ్యత.. టెస్లా ప్లాంట్ ఏర్పాటుకు ఉపయోగపడతాయని ఏపీ ప్రభుత్వం తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు 2024 అక్టోబర్‌లోనే టెస్లా (TESLA) కంపెనీతో ఏపీ ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. అప్పట్లో అమెరికాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ టెస్లా సీఎఫ్‌వో వైభవ్ తనేజాతో భేటీ అయ్యారు. ఈ విషయంపై చర్చించారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎలాన్ మస్క్‌ భేటీతో ప్లాంట్ ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

మరోవైపు టెస్లా కంపెనీని ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఆఫర్ చేసినట్లు తెలిసింది. అవసరమైన భూమిని సైతం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే టెస్లా కంపెనీ తొలుత కార్ల దిగుమతిపైనే ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఆ తర్వాతే పూర్తి స్థాయి తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ఏ మేరకు వర్కవుట్ అవుతుంది.. టెస్లా కంపెనీ ఏపీకి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏపీలో ఇప్పటికే కియా (KIA) కార్ల పరిశ్రమ ఏర్పాటైన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలో కియా కార్ల ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ నుంచి ఇప్పటికే కార్ల ఉత్పత్తి, అమ్మకాలు కూడా జరుగుతున్నాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు



పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #business #latestnews #andhra #tesla